‘రేస్‌ 4’కి సిద్ధమంటున్న సల్మాన్‌?

‘రేస్‌’.. బాలీవుడ్‌లో ఎంతో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న చిత్రం. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ‘రేస్‌ 3’లో అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్ర పోషించారు. తన యాక్షన్‌తో సినీప్రియుల్ని మెప్పించారు.

Published : 24 Jun 2024 00:57 IST

‘రేస్‌’.. బాలీవుడ్‌లో ఎంతో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న చిత్రం. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ‘రేస్‌ 3’లో అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్ర పోషించారు. తన యాక్షన్‌తో సినీప్రియుల్ని మెప్పించారు. అనిల్‌ కపూర్, బాబీ దేవోల్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి కొనసాగింపుగా ‘రేస్‌ 4’ రాబోతున్నట్లు తెలిపారు నిర్మాత రమేశ్‌ తరానీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ప్రాజెక్టు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘రాబోయే ఈ నాల్గవ చిత్రం కోసం ఇప్పటికే స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉంది. ఇందులో నటీనటులు కొత్తవాళ్లు ఉంటారు. సల్మాన్‌ ఇందులో భాగమవుతాడా లేదా అనే దానిపై ఇప్పుడేం చెప్పలేను. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే నటీనటుల వివరాల్ని ప్రకటిస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని