కశ్మీర్‌ లోయలో బచ్చన్‌ పాట

‘మిస్టర్‌ బచ్చన్‌’గా సినీప్రియుల్ని పలకరించనున్నారు కథానాయకుడు రవితేజ. ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక.

Published : 24 Jun 2024 00:58 IST

‘మిస్టర్‌ బచ్చన్‌’గా సినీప్రియుల్ని పలకరించనున్నారు కథానాయకుడు రవితేజ. ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో జరుగుతోంది. ఇందులో భాగంగా రవితేజ, భాగ్యశ్రీలపై ఓ అందమైన మెలోడీ గీతాన్ని తెరకెక్కించారు. దీనికి శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు అందిస్తున్నారు. ఈ విషయాల్ని చిత్రబృందం ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ రవితేజ కొత్త స్టిల్‌ను పంచుకుంది. దీంతో ఈ సినిమా 90శాతం షూట్‌ పూర్తి కానుంది. త్వరలోనే మిగిలిన చిత్రీకరణను పూర్తి చేసి.. విడుదల తేదీ ప్రకటించనున్నారు. స్టైలిష్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రంలో జగపతిబాబు, సచిన్‌ ఖేడ్కర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతమందిస్తుండగా.. అయనంక బోస్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని