ఏడేళ్ల ప్రేమ ముడి పడిన వేళ!

‘హీరామండీ:ది డైమండ్‌ బజార్‌’లో మెరిసిన బాలీవుడ్‌ అందాల తార సోనాక్షి సిన్హా.. తన ప్రియుడు జహీర్‌ ఇక్బాల్‌తో ఆదివారం వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

Published : 24 Jun 2024 01:01 IST

‘హీరామండీ:ది డైమండ్‌ బజార్‌’లో మెరిసిన బాలీవుడ్‌ అందాల తార సోనాక్షి సిన్హా.. తన ప్రియుడు జహీర్‌ ఇక్బాల్‌తో ఆదివారం వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమ పక్షుల్లా ఉన్న ఈ ఇద్దరు రిజిస్టర్డ్‌ మ్యారేజీతో ఒక్కటయ్యారు. వీరిద్దరు కలిసి ‘డబుల్‌ ఎక్సెల్‌’ సినిమాలో నటించారు. ‘‘ఏడేళ్ల క్రితం ఇదే రోజు మేము ప్రేమలో పడిపోయాం. అప్పటి నుంచి ఆ ప్రేమను అలాగే నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆరోజు పుట్టిన ప్రేమే ఈ మధుర క్షణానికి దారి తీసింది. మా ఇద్దరి కుటుంబాల ఆశీర్వాదంతో, దేవుని ఆశీసులతో ఇప్పుడు ఒక్కటయ్యాం’’ అంటూ సోనాక్షి పెళ్లి ఫొటోల్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని