అధర్మాన్ని అణిచేేసే విక్రమ విరాట్‌ రూపం

‘కల్కి 2898ఎ.డి’తో మరికొన్ని గంటల్లో వెండితెరపై సందడి చేయనున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ బహుభాషా చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Published : 26 Jun 2024 01:23 IST

ల్కి 2898ఎ.డి’తో మరికొన్ని గంటల్లో వెండితెరపై సందడి చేయనున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ బహుభాషా చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మంగళవారం ఈ చిత్ర థీమ్‌ గీతాన్ని విడుదల చేశారు. ‘‘అధర్మాన్ని అణిచెయ్యగ.. యుగయుగాన జగములోన.. పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్రూపమితడే’’ అంటూ సాగిన ఈ పాటకు సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చగా.. చంద్రబోస్‌ సాహిత్యమందించారు. కాలభైరవ, అనంతు, గౌతమ్‌ భరద్వాజ్‌ తదితరులు సంయుక్తంగా ఆలపించారు. మహాభారతాన్ని.. భవిష్యత్‌ కాలాన్ని ముడిపెట్టి రూపొందించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంలో భైరవగా ప్రభాస్‌ కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని