ఇది చిన్న కథ కాదు!

నటి నివేదా థామస్‌ నుంచి రెండేళ్ల విరామం తర్వాత కొత్త కబురు వినిపించింది. ఆమె ప్రస్తుతం నంద కిశోర్‌ ఈమాని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. దీన్ని రానా దగ్గుబాటి, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Published : 26 Jun 2024 01:34 IST

టి నివేదా థామస్‌ నుంచి రెండేళ్ల విరామం తర్వాత కొత్త కబురు వినిపించింది. ఆమె ప్రస్తుతం నంద కిశోర్‌ ఈమాని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. దీన్ని రానా దగ్గుబాటి, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి ‘35 - చిన్న కథ కాదు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మంగళవారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. టైటిల్‌ లుక్‌ను పంచుకున్నారు. ‘‘తిరుపతి నేపథ్యంలో జరిగే కథ ఇది. అందరి హృదయాల్ని హత్తుకునేలా ఉంటుంది. ఇందులోని స్కూల్‌ ఎపిసోడ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని రానా సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్, ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని