సెప్టెంబరులో ఎమర్జెన్సీ

ఎన్నికల ప్రచారం కోసం కొన్నాళ్లు సినిమాల్ని పక్కన పెట్టిన కంగనా రనౌత్‌ మళ్లీ జోరు పెంచుతోంది. తాజాగా తన పొలిటికల్‌ డ్రామా చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదల తేదీని ప్రకటించింది.

Published : 26 Jun 2024 01:36 IST

ఎన్నికల ప్రచారం కోసం కొన్నాళ్లు సినిమాల్ని పక్కన పెట్టిన కంగనా రనౌత్‌ మళ్లీ జోరు పెంచుతోంది. తాజాగా తన పొలిటికల్‌ డ్రామా చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదల తేదీని ప్రకటించింది. 1975 ఎమర్జెన్సీ కాలం నేపథ్యంలో ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తోంది కంగన. ఈ సందర్భంగా ప్రఖ్యాత రచయిత విలియమ్‌ షేక్‌స్పియర్‌ నవల ‘మాక్‌బెత్‌’లోని కొన్ని వాక్యాలను పంచుకుంది. ‘భారత ప్రజాస్వామ్యంలో అత్యవసర పరిస్థితి కాలం ఒక చీకటి అధ్యాయం. ఈ వివాదాస్పద అధ్యాయం వెనక ఉన్న అసలు నిజాలను బయట పెట్టేందుకు సెప్టెంబరు 6న థియేటర్లలోకి వస్తున్నాం’ అంటూ వ్యాఖ్యానించింది. ఇందులో అనుపమ్‌ఖేర్, మహిమా చౌదరి, మిలింద్‌ సోమన్, శ్రేయస్‌ తల్పడే ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు