ముక్కోణపు ప్రేమకథలో ఈ ముగ్గురు?

బాలీవుడ్‌లో వరుస చిత్రీకరణలతో బిజీగా గడుపుతున్న కథానాయకుల్లో వరుణ్‌ ధావన్‌ ఒకరు. ప్రస్తుతం ‘బేబీ జాన్‌’, ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ లాంటి చిత్రాలతో జోరు చూపిస్తున్న వరుణ్‌ తన తండ్రి డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

Published : 26 Jun 2024 01:39 IST

బాలీవుడ్‌లో వరుస చిత్రీకరణలతో బిజీగా గడుపుతున్న కథానాయకుల్లో వరుణ్‌ ధావన్‌ ఒకరు. ప్రస్తుతం ‘బేబీ జాన్‌’, ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ లాంటి చిత్రాలతో జోరు చూపిస్తున్న వరుణ్‌ తన తండ్రి డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ముక్కోణపు ప్రేమకథ కీలకమని చిత్రవర్గాల మాట. మరి ఈ ప్రేమకథలో వరుణ్‌ సరసన నటించేందుకు టాలీవుడ్‌లో రాణిస్తున్న శ్రీలీల, మృణాల్‌ ఠాకూర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిత్రం సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌ ప్రధాన పాత్రలో రానున్న ‘డైలర్‌’లో శ్రీలీల నటించనుందని వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టుతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుందన్న శ్రీలీల ఇప్పడు వరుణ్‌తోనూ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది మొదట పట్టాలెక్కనుందో.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని