విష్వక్‌సేన్‌.. లైలా

ఓ కథానాయకుడు తెరపైన అటు అమ్మాయిగా, ఇటు అబ్బాయిగా కనిపించి సందడి చేయడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. యువ కథానాయకుడు విష్వక్‌సేన్‌ కూడా ‘లైలా’తో ఆ తరహా ప్రయత్నం చేస్తున్నారు.

Published : 04 Jul 2024 01:18 IST

కథానాయకుడు తెరపైన అటు అమ్మాయిగా, ఇటు అబ్బాయిగా కనిపించి సందడి చేయడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. యువ కథానాయకుడు విష్వక్‌సేన్‌ కూడా ‘లైలా’తో ఆ తరహా ప్రయత్నం చేస్తున్నారు. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయిక. బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నిచ్చారు. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వెంకట సతీశ్‌ కిలారు, జెమినీ కిరణ్‌ స్క్రిప్ట్‌ని అందజేశారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. మానసికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లతో కూడిన లైలా పాత్రలో విష్వక్‌సేన్‌ సందడి చేస్తారు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన విధానం, నటన ఆకట్టుకుంటుంది. ప్రతిభావంతులైన నటులు, సాంకేతిక నిపుణులు కలిసి ఈ చిత్రం చేస్తున్నార’’ని తెలిపాయి సినీవర్గాలు. రచన: వాసుదేవమూర్తి, సంగీతం: తనిష్క్‌ బాగ్చి, జిబ్రాన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని