షారుక్‌కి స్విట్జర్లాండ్‌ పురస్కారం

బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌ ప్రతిష్ఠాత్మక 77వ లోకర్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఆయనను ‘పార్డో అలా కెరియరే అస్కోనా-లోకర్నో టూరిజం’ అవార్డుతో ఆగస్టు 10న సత్కరించనున్నారు.

Published : 04 Jul 2024 01:26 IST

బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌ ప్రతిష్ఠాత్మక 77వ లోకర్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఆయనను ‘పార్డో అలా కెరియరే అస్కోనా-లోకర్నో టూరిజం’ అవార్డుతో ఆగస్టు 10న సత్కరించనున్నారు. ఈ చిత్రోత్సవాలు స్విట్జర్లాండ్‌లోని లోకర్నోలో జరగనున్నాయి. ఈ సందర్భంగా షారుక్‌ నటించిన ‘దేవదాస్‌’ని ఆగస్టు 7న చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు. షారుక్‌ సినీరంగానికి చేసిన చేసిన విశేష సేవలకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ‘32 ఏళ్లలో వందకుపైగా చిత్రాల్లో నటించిన భారతీయ సూపర్‌స్టార్, గ్లోబల్‌ ఐకాన్‌ ఆయన. అన్నిరకాల జానర్స్‌లో, విశేషమైన పాత్రల్లో నటించారు. ఆ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసి గౌరవిస్తున్నాం’ అని చిత్రోత్సవాల వెబ్‌సైట్‌లో తెలిపారు. అందులో షారుక్‌ని.. కింగ్‌ ఖాన్, నటనలో లెజెండ్, జనం హీరోగా అభివర్ణించారు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటుడు షారుక్‌.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని