కొత్త జంటకు దెయ్యం పాట్లు

అదొక శాపగ్రస్తమైన ఊరు. ఆ ఊరిలో ప్రతి ఇంటికి రెండు గుమ్మాలుంటాయి. ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. ప్రతి మంగళవారం దెయ్యం రాకపోకల కోసం రెండోదాన్ని తెరిచి ఉంచాల్సిందే.

Published : 04 Jul 2024 01:27 IST

 

అదొక శాపగ్రస్తమైన ఊరు. ఆ ఊరిలో ప్రతి ఇంటికి రెండు గుమ్మాలుంటాయి. ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. ప్రతి మంగళవారం దెయ్యం రాకపోకల కోసం రెండోదాన్ని తెరిచి ఉంచాల్సిందే. కానీ పొరపాటున చిన్న గుమ్మాన్ని మూసేస్తుంది కొత్తగా పెళ్లైన ఓ జంట. ఆ తర్వాతేం జరిగింది? అసలు కథేంటి తెలియాలంటే ‘కాకుద’ చిత్రం చూడాల్సిందే. బుధవారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌లో ఈ ఉత్కంఠ రేపే సన్నివేశాలు చూపించారు. సోనాక్షి సిన్హా, రితేశ్‌ దేశ్‌ముఖ్, షకీబ్‌ సలీమ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ‘ముంజ్యా’ దర్శకుడు ఆదిత్య సర్పోత్‌దార్‌నే ఈ హారర్‌ కామెడీకీ దర్శకత్వం వహించారు. ఇందులో సోనాక్షి, షకీబ్‌లు దెయ్యంతో ఇబ్బంది పడే కొత్త జంటగా కనిపించగా.. దెయ్యాన్ని వెంటాడి బంధించడానికి వచ్చే మాంత్రికుడిగా రితేశ్‌ నటించారు. ఈ సినిమా జులై 5న విడుదలవుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని