జీవితాన్నే మార్చిన నిర్ణయం..

‘బెస్ట్‌ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు..’ అంటున్నాడు కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ మధ్య తరగతి యువకుడు.

Published : 05 Jul 2024 01:19 IST

‘బెస్ట్‌ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు..’ అంటున్నాడు కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ మధ్య తరగతి యువకుడు. పిల్లల విషయంలో ఇంకా ఆయన లెక్కలేమిటో తెలియాలంటే ‘జనక అయితే గనక’ చూడాల్సిందే. సుహాస్, సంకీర్తన నాయకానాయికలుగా దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకుడు. హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ‘ఆ ఒక్క నిర్ణయం నా లైఫ్‌ని మార్చేసింది...’ అంటూ మొదలయ్యే ఈ టీజర్‌లో ‘నేను ఒక వేళ తండ్రినైతే నా పెళ్లాన్ని సిటీలో ఉన్న బెస్ట్‌ హాస్పిటల్‌లో చూపించాలి. నా పిల్లల్ని బెస్ట్‌ స్కూల్‌లో చేర్పించాలి.. మంచి ఎడ్యుకేషన్‌ ఇప్పించాలి’ లాంటి సంభాషణలతో ఆసక్తిగా సాగుతోంది. సంగీత్, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు