కొంటె పిల్లోడు.. కొల్హాపుర్‌ మహరాణి

‘నువ్వు కొంటె పిల్లోడివి.. నేను కొల్హాపుర్‌ మహరాణిని... కారడవిలో నిప్పులాంటి నన్ను నువ్వు ఆర్పేయ్‌.. ఈ తుపాను సంగీతాన్ని నీ వశం చేసుకో’ అంటోంది రాధికా మదన్‌.

Published : 05 Jul 2024 01:21 IST

‘నువ్వు కొంటె పిల్లోడివి.. నేను కొల్హాపుర్‌ మహరాణిని... కారడవిలో నిప్పులాంటి నన్ను నువ్వు ఆర్పేయ్‌.. ఈ తుపాను సంగీతాన్ని నీ వశం చేసుకో’ అంటోంది రాధికా మదన్‌. నాయికానాయకులు మరాఠీ సంప్రదాయ వివాహంతో ఒక్కటయ్యే సందర్భంలో వచ్చే ఈ కొంటె గీతం.. తాజాగా విడుదలైంది. అక్షయ్‌కుమార్, రాధికా మదన్‌ జంటగా తెరకెక్కుతున్న ‘సర్ఫిరా’ చిత్రంలోనిది ఈ పాట. సుధా కొంగర దర్శకురాలు. ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘చావట్‌’ అనే ఈ రెండో పాటని సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది చిత్రబృందం. ‘ఇది వీర్, రాణిల వివాహం. మీ అందరూ ఆహ్వానితులే’ అనే వ్యాఖ్యల్ని జోడించింది. దీనికి మనోజ్‌ ముంతషీర్‌ శుక్లా సాహిత్యం అందించగా, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ బాణీలు సమకూర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని