నేను ఒక పోరాట ఘట్టం చేశా

‘‘అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన మంచి వాణిజ్య చిత్రం ‘తిరగబడరసామీ’. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అంది మాల్వి మల్హోత్రా.

Published : 05 Jul 2024 01:23 IST

‘‘అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన మంచి వాణిజ్య చిత్రం ‘తిరగబడరసామీ’. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అంది మాల్వి మల్హోత్రా. రాజ్‌తరుణ్‌ హీరోగా ఎ.ఎస్‌ రవికుమార్‌ చౌదరి తెరకెక్కించిన చిత్రమే ‘తిరగబడరసామీ’. ఈ సినిమాతోనే తెలుగులోకి కథానాయికగా అడుగు పెడుతోంది మాల్వి.  ఇది త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆమె గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించింది. 

  • ‘‘యాక్షన్, డ్రామా, వినోదం, రొమాన్స్, భావోద్వేగాలు.. ఇలా అన్ని రకాల అంశాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో దర్శకుడు రవికుమార్‌ ఈ చిత్రం తెరకెక్కించారు. ఇందులో రాజ్‌తరుణ్‌ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సైలెంట్‌గా మొదలై వైలెంట్‌గా మారే పాత్ర ఆయనది. ఇక దీంట్లో నా పాత్ర చాలా హైపర్‌ యాక్టివ్‌గా ఉంటుంది. నా పాత్ర చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఈ సినిమాలో కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలు చాలా ఉన్నాయి’’. 
  • ‘‘ఇందులో నా పాత్ర బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని పోలి ఉంటుంది. నేనిందులో మహిళలకు ఆత్మరక్షణ పద్ధతులు నేర్పిస్తుంటా. అంతేకాదు దీంట్లో నేను స్వయంగా ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా చేశాను. అది అందరికీ నచ్చేలా ఉంటుంది. రవికుమార్‌ మంచి విజన్‌ ఉన్న దర్శకుడు. తను ఏదైతే చెప్పారో.. దాన్ని అంతే చక్కగా తెరపైకి తీసుకొచ్చారు’’.
  • ‘‘మాది హిమాచల్‌ ప్రదేశ్‌. చదువు కోసం ముంబయి వెళ్లాను. అక్కడే థియేటర్‌ ఆర్ట్స్‌లో చేరాను. టీవీ ఇండస్ట్రీ నుంచి నటిగా నా ప్రయాణాన్ని ప్రారంభించా. తర్వాత హిందీలో ఓ సినిమా చేశా. మలయాళ, తమిళంలో పని చేశా. ఇప్పుడీ చిత్రంతో తెలుగులోకి వస్తున్నా. నాకు అన్ని జానర్స్‌ ఇష్టమే. కథలో ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలనుకుంటా. రాజమౌళి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన చిత్రంలో భాగమవడం నా కల. అలాగే మణిరత్నంతో పని చేయాలని ఉంది’’.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని