‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రీకరణ పూర్తి

విజయవంతమైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి కొనసాగింపుగా రూపొందుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రీకరణ పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15న  ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Published : 06 Jul 2024 01:24 IST

విజయవంతమైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి కొనసాగింపుగా రూపొందుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రీకరణ పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15న  ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. రామ్‌ పోతినేని కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రమిది. కావ్య థాపర్‌ కథానాయిక. సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషించారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తూ, ఛార్మితో కలిసి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి కావడంతో...  నిర్మాణానంతర పనులు, ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ‘‘ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఇదొకటి.  ఇటీవలే ‘స్టెప్పా మార్‌...’ పాటని విడుదల చేశాం. మంచి స్పందన లభించింది. త్వరలోనే మరిన్ని ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు, జియాని జియాన్నెలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని