దుల్కర్‌కి జోడీగా కృతి?

‘మనమే’ అంటూ ఇటీవల తెరపై సందడి చేసింది ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి. వరస సినిమాలతో మలయాళ, తమిళ భాషల్లో జోరు చూపిస్తున్న ఈ భామ, కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది.

Published : 06 Jul 2024 01:26 IST

‘మనమే’ అంటూ ఇటీవల తెరపై సందడి చేసింది ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి. వరస సినిమాలతో మలయాళ, తమిళ భాషల్లో జోరు చూపిస్తున్న ఈ భామ, కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘కల్కి’లో మెరిసి, త్వరలో ‘లక్కీ భాస్కర్‌’గా ప్రేక్షకుల ముందుకు రానున్న దుల్కర్‌ తన తదుపరి చిత్రాన్ని సెల్వమని సెల్వరాజ్‌ దర్శకత్వంలో చేయనునున్నట్లు తెలిసింది. ఆ సినిమాలో దుల్కర్‌కి జోడీగా కృతిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుని తెలుగు కథానాయకుడు రానా నిర్మిస్తూ... ఇందులో కీలక పాత్రలో నటించనున్నట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. ఈ జంట ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. తొలిసారి జట్టు కట్టిన ఈ జోడీ ఎలాంటి కథతో అభిమానులను అలరించనుందో తెలియాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన చేసే వరకూ వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని