వీర... కుబేర

ధనుష్, నాగార్జున కథానాయకులుగా... శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక.

Updated : 06 Jul 2024 06:47 IST

ధనుష్, నాగార్జున కథానాయకులుగా... శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలోని రష్మిక పోషిస్తున్న పాత్రని పరిచయం చేస్తూ, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. భూమిలో పాతిపెట్టిన డబ్బుని వెలికి తీస్తూ ప్రచార చిత్రంలో కనిపించారు రష్మిక. పురాణాలతో ముడిపడిన ఓ సోషల్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘‘నటీనటుల్ని విభిన్నమైన పాత్రల్లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు. చిత్రీకరణతోపాటు, నిర్మాణానంతర పనుల్నీ ఏకకాలంలో జరుపుతున్నాం. రష్మిక ఫస్ట్‌లుక్‌ థ్రిల్లింగ్‌గా, ఆత్రుతని పెంచేలా ఉంది.  ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా అందుకు తగ్గట్టుగానే అందరినీ అలరిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని