రామ్‌చరణ్‌ ముగించారు

కథానాయకుడు రామ్‌చరణ్‌.. దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఎస్‌.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Published : 07 Jul 2024 01:54 IST

థానాయకుడు రామ్‌చరణ్‌.. దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఎస్‌.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్‌ పాత్రకు సంబంధించిన మొత్తం చిత్రీకరణ శనివారంతో పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడాయన బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న తదుపరి చిత్రం కోసం లుక్కు మార్చుకోనున్నారు. ఇక మరో పదిరోజుల ప్యాచ్‌ వర్క్‌ పూర్తయితే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. త్వరలోనే దాన్ని పూర్తి చేసి.. విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో చరణ్‌ రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: తిరు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని