మా ‘డార్లింగ్‌’ అందర్నీ మెప్పిస్తుంది

‘‘వినోదం.. భావోద్వేగాలతో కుటుంబ సమేతంగా కనెక్ట్‌ అయ్యేలా తీసిన చిత్రం ‘డార్లింగ్‌’. తప్పకుండా ఇది అందర్నీ మెప్పిస్తుంది’’ అన్నారు నిర్మాత చైతన్య రెడ్డి. ‘హనుమాన్‌’ విజయం తర్వాత చైతన్య, కె.నిరంజన్‌ రెడ్డిల సంయుక్త నిర్మాణం నుంచి వస్తున్న చిత్రమే ‘డార్లింగ్‌’.

Updated : 07 Jul 2024 02:11 IST

‘‘వినోదం.. భావోద్వేగాలతో కుటుంబ సమేతంగా కనెక్ట్‌ అయ్యేలా తీసిన చిత్రం ‘డార్లింగ్‌’. తప్పకుండా ఇది అందర్నీ మెప్పిస్తుంది’’ అన్నారు నిర్మాత చైతన్య రెడ్డి. ‘హనుమాన్‌’ విజయం తర్వాత చైతన్య, కె.నిరంజన్‌ రెడ్డిల సంయుక్త నిర్మాణం నుంచి వస్తున్న చిత్రమే ‘డార్లింగ్‌’. నభా నటేశ్, ప్రియదర్శి జంటగా నటించిన ఈ సినిమాని అశ్విన్‌ రామ్‌ తెరకెక్కించారు. ఇది ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు చైతన్య రెడ్డి. 

‘‘హనుమాన్‌’ విడుదలకు ముందే చిత్రీకరణ ప్రారంభించుకున్న సినిమా ఇది. మనం ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం.. పెళ్లై, పిల్లలు వచ్చి జీవితంలో బిజీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటున్నాం.. అనే అంశంతో దర్శకుడు చెప్పిన కథ మాకు బాగా నచ్చింది. కచ్చితంగా ఈ ‘డార్లింగ్‌’ అందరికీ చేరువవుతుంది’’. 

  • ‘‘ఈ సినిమాకి మేము తొలుత వైదిస్‌ కొలవరి అనే టైటిల్‌ పెట్టాలనుకున్నాం. కాకపోతే ఆ పేరు యువతకు మాత్రమే చేరువవుతుందన్న ఉద్దేశంతో ‘డార్లింగ్‌’ పేరు పెట్టాం. దీంట్లో నాయకానాయికలిద్దరి పాత్రలకు సమాన ప్రాధాన్యముంటుంది. నభా పాత్ర మహిళల గౌరవాన్ని పెంచేలా ఉంటుంది’’. 
  • ‘‘ప్రస్తుతం ‘జై హనుమాన్‌’ సినిమా పూర్వ నిర్మాణ పనుల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్రాంతికి దాన్ని పూర్తి చేయలేం. దీన్ని ఓ మార్వెల్‌ సిరీస్‌లా చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి కాస్త టైమ్‌ తీసుకునే ముందుకెళ్లాలనుకుంటున్నాం. దీంట్లో హనుమాన్‌ పాత్ర ఎవరు చేస్తారన్నది హనుమంతుడే నిర్ణయించాలి. వ్యక్తిగతంగా నాకైతే ఆ పాత్ర చిరంజీవి, రామ్‌చరణ్‌లలో ఎవరైనా చేస్తే బాగుంటుందనిపిస్తోంది. ఈ విషయంలో నిరంజన్‌ ఆలోచనలు మరోలా ఉన్నాయి. మరి ఆ స్వామి తన కథను ఎలా.. ఎవరితో చెప్పించుకుంటారన్నది చూడాలి. ప్రస్తుతం మేము సాయి దుర్గాతేజ్‌తో ఓ సినిమా చేస్తున్నాం. ఇంకో పది సినిమాలు పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్నాయి’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని