కొత్త నేపథ్యంతో.. తుఫాన్‌

ఇటీవలే ‘లవ్‌గురు’తో ప్రేక్షకుల్ని అలరించారు విజయ్‌ ఆంటోని. ఇప్పుడాయన ‘తుఫాన్‌’తో పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్‌ మిల్టన్‌ తెరకెక్కించారు.

Published : 08 Jul 2024 01:26 IST

టీవలే ‘లవ్‌గురు’తో ప్రేక్షకుల్ని అలరించారు విజయ్‌ ఆంటోని. ఇప్పుడాయన ‘తుఫాన్‌’తో పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్‌ మిల్టన్‌ తెరకెక్కించారు. కమల్‌ బోరా, డి.లలిత, బి.ప్రదీప్, పంకజ్‌ బోరా సంయుక్తంగా నిర్మించారు. మేఘా ఆకాశ్‌ కథానాయిక. డాలీ ధనుంజయ, శరత్‌కుమార్, సత్యరాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 26న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల ట్రైలర్‌ ఇంట్రడక్షన్‌ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర నేపథ్యం చాలా కొత్తగా ఉంటుంది. నేను.. మేఘా జంటగా ఆకట్టుకుంటాం. నాకింత మంచి కథ అందించిన దర్శకుడు విజయ్‌ మిల్టన్‌కు కృతజ్ఞతలు. ఆయన దీనికి ఛాయాగ్రాహకుడిగానూ వ్యవహరించారు. ఈ సినిమా థియేటర్‌లో అందరితో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు. ‘‘భాష్యశ్రీ ఇది స్ట్రైట్‌ తెలుగు సినిమా అనేంత బాగా రచన చేశారు. తప్పకుండా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు. నటి మేఘా ఆకాశ్‌ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన చిత్రం. ప్రేమ, వినోదం, యాక్షన్, ఎమోషన్, మంచి పాటలు.. అన్నీ ఉన్నాయి’’ అంది. ఈ కార్యక్రమంలో ధనుంజయన్, భాష్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని