బచ్చల మల్లి.. డబ్బింగ్‌కు శ్రీకారం

‘బచ్చల మల్లి’గా బాక్సాఫీస్‌ ముందు సందడి చేయనున్నారు అల్లరి నరేశ్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సుబ్బు మంగదేవి తెరకెక్కించారు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు.

Published : 08 Jul 2024 01:28 IST

చ్చల మల్లి’గా బాక్సాఫీస్‌ ముందు సందడి చేయనున్నారు అల్లరి నరేశ్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సుబ్బు మంగదేవి తెరకెక్కించారు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. అమృత అయ్యర్‌ కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా తాజాగా డబ్బింగ్‌ పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడీ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు చిత్రవర్గాలు ఆదివారం ప్రకటించాయి. రా అండ్‌ రస్టిక్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో నరేశ్‌ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన మాస్‌ పాత్ర పోషిస్తున్నారు. ఇది సెప్టెంబరులో థియేటర్లలోకి రానుంది. ఇందులో రావు రమేశ్, రోహిణి, అచ్యుత్‌ కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతమందిస్తున్నారు. రిచర్డ్‌ ఎం.నాథన్‌ ఛాయాగ్రాహకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని