డిటెక్టివ్‌ రూహి

‘గులాబీ’లో ఆటోవాలాగా కనిపించనున్న బాలీవుడ్‌ భామ హుమా ఖురేషీ, ఇప్పుడు డిటెక్టివ్‌ రూహి పాత్ర పోషించనుంది. వికాస్‌ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బయాన్‌’లో తను ఆ విధంగా కనిపించనుంది.

Published : 08 Jul 2024 01:30 IST

గులాబీ’లో ఆటోవాలాగా కనిపించనున్న బాలీవుడ్‌ భామ హుమా ఖురేషీ, ఇప్పుడు డిటెక్టివ్‌ రూహి పాత్ర పోషించనుంది. వికాస్‌ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బయాన్‌’లో తను ఆ విధంగా కనిపించనుంది. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని శీలాదిత్య బోరా, మధు శర్మ, కునాల్‌ కుమార్, అన్షుమన్‌ సింగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని హుమా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. చిత్రబృందంతో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంది. ‘నేనెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బయాన్‌’. చిత్ర కథనం అద్భుతంగా ఉంటుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు, నటీనటులు ఇందులో భాగం కానున్నారు’ అంటూ రాసుకొచ్చింది. తన తండ్రి కోసం.. డిటెక్టివ్‌గా మారిన రూహి, తొలి కేసు దర్యాప్తు కోసం రాజస్థాన్‌లోని ఓ పల్లెటూరికి వెళ్తుంది. అక్కడ ఎదుర్కొన్న సవాళ్ల చుట్టూ తిరిగే కథనంతో ఈ చిత్రం రానుంది. సచిన్‌ ఖేడ్కర్, చంద్రచూఢ్‌సింగ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు