చారు.. నేరుగా మీ హృదయాల్లోకే!

కథానాయకుడు నాని.. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.

Published : 08 Jul 2024 01:33 IST

థానాయకుడు నాని.. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక అరుల్‌మోహన్‌ కథానాయిక. ఆమె ఇందులో చారులత అనే పోలీసుగా కనిపించనుందని తెలియజేస్తూ.. ఆదివారం తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. అందులో ఆమె ఖాకీ దుస్తుల్లో అమాయకమైన లుక్‌తో క్యూట్‌గా చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ‘‘చారు.. నేరుగా మీ హృదయాల్లో రిపోర్ట్‌ చేసే లక్ష్యంతో వస్తోంది’’ అంటూ ఆ పోస్టర్‌కు ఓ వ్యాఖ్యను కూడా జత చేసింది చిత్ర బృందం. వినూత్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో సూర్యగా నాని రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లోకి రానుంది. సంగీతం: జేక్స్‌ బిజోయ్, ఛాయాగ్రహణం: జి.మురళి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని