సెప్టెంబరు 7న ‘లక్కీ భాస్కర్‌’

దుల్కర్‌ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న ‘లక్కీ భాస్కర్‌’ సెప్టెంబరు 7న విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

Published : 09 Jul 2024 01:11 IST

దుల్కర్‌ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న ‘లక్కీ భాస్కర్‌’ సెప్టెంబరు 7న విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా తెలుగుతోపాటు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. 1980 - 90 నేపథ్యంలో ఓ బ్యాంక్‌ క్యాషియర్‌ అసాధారణ ప్రయాణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ముంబయి నగరాన్ని పోలిన సెట్‌ని హైదరాబాద్‌లో పునర్నిర్మించి చిత్రీకరణ చేశారు. ఈ సినిమాకి  సంగీతం: జి.వి.ప్రకాశ్‌ కుమార్, ఛాయాగ్రహణం: నిమిష్‌ రవి, కూర్పు: నవీన్‌ నూలి.


ఎవరూ ప్రయత్నించని ఆసక్తికర కథతో..

ది సాయికుమార్, అవికా గోర్‌ జంటగా షణ్ముగం సాప్పని తెరకెక్కించిన చిత్రం ‘షణ్ముఖ’. తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం, రమేశ్‌ యాదవ్‌ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఆది కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో ఆది పోలీసుగా కనిపించగా.. బ్యాగ్రౌండ్‌లో షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి కనిపించడం ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు షణ్ముగం మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన ఆధ్యాత్మిక థ్రిల్లర్‌. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. సంగీతం: రవి బస్రూర్‌.


అమ్మ లాలో రామ్‌భజన.. 

య్‌’తో సినీప్రియుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు నార్నే నితిన్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అంజి కె.మణిపుత్ర తెరకెక్కించారు. నయన్‌ సారిక కథానాయిక. బన్నీవాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పించారు. ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ చిత్రం నుంచి ‘‘అమ్మ లాలో రామ్‌ భజన’’ అనే గీతాన్ని విడుదల చేశారు. శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారి మధ్య ప్రేమను తెలియజేస్తూ బుర్రకథ పంథాలో ఈ పాట వైవిధ్యభరితంగా సాగింది. దీనికి అజయ్‌ అరసాడ స్వరాలు సమకూర్చగా.. దర్శకుడు అంజి సాహిత్యమందించారు. పెంచల్‌ దాస్‌ ఆలపించారు. ‘‘గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే వినోదం నిండిన కుటుంబ కథా చిత్రమిది. నార్నే నితిన్, నయన్‌ సారికల జోడీ అందర్నీ ఆకట్టుకుంటుంది. నిర్మాణానంతర పనులు ముగింపు దశలో ఉన్నాయ’’ని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: రామ్‌ మిరియాల ఛాయాగ్రహణం: సమీర్‌ కల్యాణి.


ప్రేమకు నిర్వచనం.. ఉషా పరిణయం 

ర్శకుడు విజయ్‌ భాస్కర్‌ స్వీయ దర్శకత్వంలో తన తనయుడు శ్రీకమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ఉషా పరిణయం’. తాన్వి ఆకాంక్ష కథానాయిక. ఈ సినిమా ఆగస్టు 2న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత విజయ భాస్కర్‌ మాట్లాడుతూ.. ‘‘సరికొత్త ప్రేమకథతో.. అన్ని భావోద్వేగాలు నిండిన ప్రేమ కథా చిత్రమిది. ప్రేమకు నేనిచ్చే నిర్వచనమే ఈ సినిమా. ఇది సినీ ప్రేమికులకు ఓ విందు భోజనంలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్‌.ఆర్‌.ధ్రువన్, ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని