‘తంగలాన్‌’ ట్రైలర్‌ రెడీ.. ముందుగానే వస్తున్న ‘లక్కీ భాస్కర్‌’

విక్రమ్‌ నటించిన ‘తంగలాన్‌’ మూవీ ట్రైలర్‌ రెడీ సిద్ధమవగా, దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌’ విడుదల తేదీ మారింది.

Published : 09 Jul 2024 20:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు విక్రమ్‌. పా.రంజిత్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా?అని విక్రమ్‌ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు పా రంజిత్‌ (PA Ranjith) ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ‘బంగారం కోసం అన్వేషణ, విముక్తి కోసం జరిగే పోరాటం రక్తపాతమై..’’ అంటూ జులై 10న ట్రైలర్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని  జనవరిలో విడుదల చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

ముందుకొచ్చిన ‘లక్కీ భాస్కర్‌’

ఇదిలా ఉంటే...  దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar). మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ విడుదల తేదీ మారింది. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం. సెప్టెంబర్‌ 27 విడుదల కావాల్సి ఉండగా,  వినాయక చతుర్థి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు