కామన్‌మ్యాన్‌గా.. మోహన్‌లాల్‌

వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ జోరు మీదున్న అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ ఇదే ఊపులో మరో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.

Published : 10 Jul 2024 00:56 IST

రుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ జోరు మీదున్న అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ ఇదే ఊపులో మరో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. సత్యన్‌ అంతిఖడ్‌ దర్శకత్వంలో ‘హృదయపూర్వం’ అనే చిత్రాన్ని ఈ మధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో మోహన్‌లాల్‌ కామన్‌మ్యాన్‌ పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి దర్శకుడి కుమారుడు అనూప్‌ సరికొత్త అప్‌డేట్‌ అందించారు. ‘మోహన్‌లాల్‌-సత్యన్‌ కలయికలో మరో సూపర్‌ ఫన్‌ ప్రాజెక్టు ముస్తాబు కానుంది. ఇది వచ్చే నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది’ అని వ్యాఖ్యానిస్తూ దర్శకనిర్మాతలతో మోహన్‌లాల్‌ కలిసి ఉన్న ఫొటోని పంచుకున్నాడు. మోహన్‌లాల్‌-సత్యన్‌ కలయికలో గతంలో వచ్చిన ఆరు చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ సినిమాకి జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని