కథ కుదిరిందా?

‘ఏజెంట్‌’ తర్వాత కథానాయకుడు అఖిల్‌ మరో కొత్త కబురేమీ వినిపించలేదు. కొత్త దర్శకుడు అనిల్‌ కుమార్‌తో యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి.

Published : 10 Jul 2024 01:00 IST

జెంట్‌’ తర్వాత కథానాయకుడు అఖిల్‌ మరో కొత్త కబురేమీ వినిపించలేదు. కొత్త దర్శకుడు అనిల్‌ కుమార్‌తో యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం అది పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు హీరో నాగార్జున కూడా తన తనయుడు అఖిల్‌ కోసం మంచి కథను వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ కిశోర్‌ తన కథతో నాగ్‌ను మెప్పించినట్లు సమాచారం. ఇది చిత్తూరు నేపథ్యంలో సాగే ఓ రూరల్‌ డ్రామా కథగా ఉండనుందని.. అఖిల్‌కు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై నాగ్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆయన దీన్ని తమ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని