నేడే ఈటీవీ విన్‌లో ‘ప్లాట్‌’

వికాస్‌ ముప్పల, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ప్లాట్‌’. బీబీటీ ఫిల్మ్స్‌ పతాకంపై భాను భవ తారక స్వయంగా నిర్మిస్తూ తెరకెక్కించారు.

Updated : 11 Jul 2024 00:57 IST

వికాస్‌ ముప్పల, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ప్లాట్‌’. బీబీటీ ఫిల్మ్స్‌ పతాకంపై భాను భవ తారక స్వయంగా నిర్మిస్తూ తెరకెక్కించారు. సంతోష్, కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ట్రైలర్‌ ఎన్నో మలుపులతో ఆసక్తిగా సాగింది. తాజాగా ఈ రోజే ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో విడుదలైంది. ఏ వ్యాపారం చేసినా ఫెయిల్‌ అవుతూనే ఉంటాడు రాహుల్‌. చివరికి రియల్‌ ఎస్టేట్‌లో రాణిస్తూ..విజయం అందుకుంటాడు. కానీ, అంతలోనే..హత్య, మోసం, బెదిరింపులు..ఇలా అనేక ఇబ్బందులు చుట్టుముట్టి తన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అదే పేరుతో తన ప్రయాణంలోకి మరో వ్యక్తి వస్తాడు. అతనెవరు? తన జీవితంలోకి ఎందుకొచ్చాడు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని