కొత్త దర్శకుడితో?

‘విరాట పర్వం’ తర్వాత కథానాయకుడు రానా దగ్గుబాటి నుంచి పూర్తి స్థాయి సినిమా రాలేదు. తేజ దర్శకత్వంలో సినిమా ఖరారైనా, అది ఇంకా పట్టాలెక్కలేదు.

Updated : 11 Jul 2024 00:59 IST

విరాట పర్వం’ తర్వాత కథానాయకుడు రానా దగ్గుబాటి నుంచి పూర్తి స్థాయి సినిమా రాలేదు. తేజ దర్శకత్వంలో సినిమా ఖరారైనా, అది ఇంకా పట్టాలెక్కలేదు. రజనీకాంత్‌ సినిమా ‘వేట్టయాన్‌’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ‘రానా నాయుడు’ సిరీస్‌ రెండో భాగంలోనూ నటిస్తున్నారు. ఇటీవలే ఆయన కొత్త దర్శకుడు కిశోర్‌ చెప్పిన కథకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఆర్కా మీడియా వర్క్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. కథానాయికగా శ్రీనిధి శెట్టి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం అక్టోబరులో మొదలయ్యే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని