ఆలోచనలకు దృశ్యరూపం ఆపరేషన్‌ రావణ్‌

‘చిత్ర పరిశ్రమలో ఇది   ఆఖరి అవకాశం అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ ఉన్నదంతా మరొక్క అవకాశమే. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే విజయం తప్పకుండా సాధిస్తాం’ అన్నారు యువ కథానాయకుడు  విష్వక్‌సేన్‌.

Published : 11 Jul 2024 01:04 IST

చిత్ర పరిశ్రమలో ఇది   ఆఖరి అవకాశం అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ ఉన్నదంతా మరొక్క అవకాశమే. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే విజయం తప్పకుండా సాధిస్తాం’ అన్నారు యువ కథానాయకుడు  విష్వక్‌సేన్‌. ఆయన ముఖ్య అతిథిగా బుధవారం హైదరాబాద్‌లో ‘ఆపరేషన్‌ రావణ్‌’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. రక్షిత్‌ అట్లూరి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సంకీర్తన విపిన్‌ కథానాయిక. వెంకట సత్య దర్శకత్వం వహించారు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాత. ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ విడుదల అనంతరం విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. రక్షిత్‌ అట్లూరి మాట్లాడుతూ ‘‘ఆపరేషన్‌ రావణ్‌’తో మేం విజయాన్ని అందుకోబోతున్నాం. మా నాన్న దర్శకుడు అనే బెరుకు లేకుండా నేనొక నటుడిని, ఆయనొక దర్శకుడు అన్నట్టుగానే సెట్‌కి వెళ్లేవాణ్ని’’ అన్నారు. దర్శకుడు వెంకట సత్య మాట్లాడుతూ ‘‘మంచి ఆలోచనలు ఉన్న రాముడు దేవుడు అయితే, చెడు ఆలోచనలున్న రావణుడు రాక్షసుడిగా శిక్షకు గురయ్యాడు. ఆ అంశంతోనే ఈ సినిమాని తెరకెక్కించా. ఆలోచనల్ని విజువల్‌గా ఎలా చూపించామో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. రక్షిత్, ఇతర నటులు చక్కటి అభినయం ప్రదర్శించారు. రాధిక చేసిన సినిమాల్లో ఇది గుర్తుండిపోతుంది. ఓటీటీ వేదికల్లో చాలా సైకో థ్రిల్లర్స్‌ కథలు వస్తుంటాయి. వాటికి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని