రాయన్‌ సిద్ధం

‘రాయన్‌’తో థియేటర్లలో సందడి చేయనున్నారు ధనుష్‌. ఆయన హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

Published : 11 Jul 2024 01:05 IST

రాయన్‌’తో థియేటర్లలో సందడి చేయనున్నారు ధనుష్‌. ఆయన హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. సందీప్‌ కిషన్, కాళిదాస్‌ జయరామ్, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తెలుగు వెర్షన్‌ను ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్‌ దక్కించుకున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. యాక్షన్‌ ప్రాధాన్యమున్న ఆసక్తికర కథతో ఈ సినిమా తెరకెక్కింది. దీనికి ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చగా.. ఓం ప్రకాశ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని