విజయశాంతి రీఎంట్రీ.. పారితోషికం ఎంతంటే?
లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి 13 ఏళ్ల విరామం తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కోసం మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆమె రీఎంట్రీ అనడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మళ్లీ ఆమెను వెండితెరపై చూడొచ్చని అభిమానులు ఆనందపడ్డారు. దానికి తగ్గట్టే ఈ నెల 11న వచ్చిన .....
హైదరాబాద్: లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి 13 ఏళ్ల విరామం తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కోసం మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆమె రీఎంట్రీ అనడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మళ్లీ ఆమెను వెండితెరపై చూడొచ్చని అభిమానులు ఆనందపడ్డారు. దానికి తగ్గట్టే ఈ నెల 11న వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ఆమె పవర్ఫుల్ పాత్ర అలరించింది. అయితే ఈ సినిమాలో నటించేందుకు విజయశాంతి తీసుకున్న పారితోషికంపై టాలీవుడ్లో పెద్ద టాక్ నడుస్తోంది. జీఎస్టీతో కలిపి ఆమె రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ కథానాయిక తీసుకునే మొత్తానికంటే ఇది ఎక్కువని అంటున్నారు. మరి ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే నిర్మాతలు స్పందించాల్సిందే.
ఇకపై నటనను కొనసాగించాలనే ఉద్దేశంలో విజయశాంతి ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ సాధారణ పాత్రల్లో నటించనని, పవర్ఫుల్ రోల్స్ వస్తేనే చేస్తానని తెలిపారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక కథానాయిక. ఈ సినిమా మంచి టాక్ అందుకోవడంతోపాటు బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్