రజనీ సినిమా సీక్వెల్‌లో ధనుష్..?

రజనీకాంత్, మేనక నటించిన చిత్రానికి సీక్వెల్‌ రాబోతుందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. 1981లో వచ్చిన ‘నెట్రికన్‌’ చిత్రానికి కొనసాగింపుగా ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో రజనీ పాత్రను ధనుష్, మేనక పాత్రను కీర్తి సురేష్‌ పోషించనున్నారట..

Published : 24 Jan 2020 12:42 IST

మామ పాత్రలో అల్లుడు.. తల్లి పాత్రలో కుమార్తె..!

చెన్నై: రజనీకాంత్, మేనక నటించిన చిత్రానికి సీక్వెల్‌ రాబోతుందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. 1981లో వచ్చిన ‘నెట్రికన్‌’ చిత్రానికి కొనసాగింపుగా ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో రజనీ పాత్రను ధనుష్, మేనక పాత్రను కీర్తి సురేష్‌ పోషించనున్నారట. మేనక.. కీర్తి సురేష్‌ అమ్మ. ఇలా మామ(రజనీకాంత్‌) నటించిన చిత్రంలో అల్లుడు(ధనుష్‌), తల్లి(మేనక) సినిమా సీక్వెల్‌లో కూతురు(కీర్తి) నటించడం విశేషం. ‘నెట్రికన్‌’కు కె.బాలచందర్‌ స్క్రీన్‌ప్లే అందించగా, ఎస్‌.పి.ముతురామన్‌ దర్శకత్వం వహించారు. సీక్వెల్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే సందేహానికి కొన్ని రోజుల్లోనే సమాధానం రానుంది. ప్రస్తుతం ధనుష్, కీర్తి.. తమ తమ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. గతంలో కీర్తి, ధనుష్‌ ‘తొడరి’ అనే చిత్రంలో కలిసి నటించారు. తెలుగులో ‘రైల్‌’ పేరుతో విడుదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని