రావణుడిగా రానా?

రానా - తేజ కలయికలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలసి పనిచేయబోతున్నట్టు సమాచారం. ఇటీవలే తేజ ఓ కథని రానాకి

Published : 25 Jan 2020 12:31 IST

హైదరాబాద్‌: రానా - తేజ కలయికలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలసి పనిచేయబోతున్నట్టు సమాచారం. ఇటీవలే తేజ ఓ కథని రానాకి వినిపించడం, అది రానాకి నచ్చడం జరిగాయని సమాచారం. ఈ చిత్రంలో రానా రావణాసురిడిగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ‘రాక్షస రాజు..  రావణాసురుడు’ అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌   చేశారని సమాచారం. రానాతో పాటుగా మరో కథానాయకుడు నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘విరాటపర్వం’ చిత్రంతో బిజీగా ఉన్నారు రానా. ఆ సినిమా పూర్తయిన తరవాతే ‘...రావణాసురుడు’ పట్టాలెక్కుతుంది. మరోవైపు గుణశేఖర్‌ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని