‘జయం’ కలయికలో...

తేజ దర్శకత్వంలో రూపొందిన ‘జయం’... గోపీచంద్‌ కెరీర్‌ని మలుపు తిప్పింది. అందులో ప్రతినాయకుడిగా...

Published : 29 Jan 2020 17:27 IST

తేజ దర్శకత్వంలో రూపొందిన ‘జయం’... గోపీచంద్‌ కెరీర్‌ని మలుపు తిప్పింది. అందులో ప్రతినాయకుడిగా కనిపించినా, ఆ సినిమా గోపీచంద్‌ సినీ జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత ఆయన కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి గోపీచంద్‌ - తేజ కలిసి ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కథ సిద్ధమైందని తెలుస్తోంది. గోపీచంద్‌ ‘సీటీమార్‌’తో బిజీగా ఉన్నారు. అది  పూర్తయ్యాక తేజ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి. రానాతోనూ తేజ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి. ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే కథని రానా కోసం తేజ సిద్ధం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని