మెగాస్టార్‌తో మోహన్‌బాబు ఢీ..!

కథానాయకుడికి పోటాపోటీగా ప్రతినాయకుడి పాత్ర ఉన్నప్పుడే సినిమా రసవత్తరంగా సాగుతుంది. ప్రతినాయకుడితో హాస్యం పండించిన సినిమాలు విజయంవంతమైన దాఖలాలు తక్కువే. అందుకే దర్శకులు తమ సినిమాల్లో విలన్లకు వీలైనంత

Published : 03 Feb 2020 20:41 IST

హైదరాబాద్‌: కథానాయకుడికి పోటాపోటీగా ప్రతినాయకుడి పాత్ర ఉన్నప్పుడే ఆ సినిమా రసవత్తరంగా సాగుతుంది. ప్రతినాయకుడితో హాస్యం పండించిన సినిమాలు విజయంవంతమైన దాఖలాలు తక్కువే. అందుకే దర్శకులు తమ సినిమాల్లో విలన్లకు వీలైనంత ఎక్కువ ప్రాధాన్యత కల్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ హీరోలకు సరితూగే వారు దొరక్కపోతే పెద్ద మొత్తంలో చెల్లించైనా సరే వేరే హీరోలను తమ సినిమాలో విలన్లుగా చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మెగాస్టార్‌ చిరంజీవి ‘చిరు 152’ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరో విలన్‌గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

‘సైరా నరసింహారెడ్డి’తో మంచి విజయం సాధించిన మెగాస్టార్‌ ఈ చిత్రంతో మరోసారి అభిమానుల ముందుకు రానున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు పవర్‌ఫుల్‌ విలన్‌గా కనిపించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్‌ను ఢీకొట్టాలంటే మరో స్టార్‌ హీరో అయితేనే బాగుంటుందన్న ఆలోచనతో మోహన్‌బాబును చూపించనున్నట్లు సమాచారం. ఇటీవల ‘మా’ విషయంలో మెగాస్టార్‌కు రాజశేఖర్‌కు జరిగిన గొడవలో చిరుకు మోహన్‌బాబు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాలో మోహన్‌బాబు పాత్రపై బలం చేకూరుతోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. చిరు సరసన త్రిష కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని