‘కేజీఎఫ్‌2’లో రావు రమేష్‌ పాత్ర అదేనా?

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రావు రమేష్‌. అటు విలనిజంతో పాటు, ఇటు హాస్యాన్ని

Published : 14 Feb 2020 19:50 IST

హైదరాబాద్‌: విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రావు రమేష్‌. అటు విలనిజంతో పాటు, ఇటు హాస్యాన్ని కూడా పంచే అతి కొద్ది మంది నటుల్లో ఈయన ఒకరు. ‘కేజీఎఫ్‌’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ కూడా సిద్ధం అవుతోంది. ఇందులో రావు రమేష్‌ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్‌ సీబీఐ ఆఫీసర్‌గా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల రావు రమేష్‌ సెట్‌లో కూడా అడుగుపెట్టారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని