రవితేజ కొత్త సినిమా పేరు అదేనా?

రవితేజ కథానాయకుడిగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘రాక్షసుడు’తో విజయాన్ని అందుకున్నారు రమేష్‌ వర్మ. ఆయన చెప్పిన కథకి రవితేజ

Published : 25 Feb 2020 13:06 IST

హైదరాబాద్‌: రవితేజ కథానాయకుడిగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘రాక్షసుడు’తో విజయాన్ని అందుకున్నారు రమేష్‌ వర్మ. ఆయన చెప్పిన కథకి రవితేజ పచ్చజెండా ఊపేశారు. ఈ వేసవిలోనే  చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సినిమాకి ‘కిలాడీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. రవితేజ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయబోతున్నారని తెలిసింది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తారు.

రవితేజ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రుతిహాసన్‌ కథానాయిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని