బాలీవుడ్‌ తెరపైకి మరో క్రికెటర్‌ బయోపిక్‌

మరో క్రికెట్‌ దిగ్గజం సినిమా తెరపై కనిపించనున్నాడు. గాడి తప్పిన ఇండియన్‌ క్రికెట్‌ జట్టును ఒంటిచేత్తో విజయవంతంగా నడిపించిన కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ జీవిత చరిత్ర తెరకెక్కుతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సచిన్‌, ధోనీ బయోపిక్‌లు వచ్చి అభిమానులను బాగానే అలరించాయి.

Updated : 25 Feb 2020 23:28 IST

ముంబయి: మరో క్రికెట్‌ దిగ్గజం సినిమా తెరపై కనిపించనున్నాడు. గాడి తప్పిన ఇండియన్‌ క్రికెట్‌ జట్టును ఒంటిచేత్తో విజయవంతంగా నడిపించిన కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ జీవిత చరిత్ర తెరకెక్కుతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సచిన్‌, ధోనీ బయోపిక్‌లు వచ్చి అభిమానులను బాగానే అలరించాయి. తాజాగా కపిల్‌దేవ్‌ బయోపిక్‌ ‘83’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రణవీర్‌సింగ్‌ కపిల్‌దేవ్‌ పాత్రను పోషిస్తున్నారు. మరోవైపు తాప్సీ ప్రధాన పాత్రలో మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథూ’ కూడా అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా.. గంగూలీ బయోపిక్‌ కూడా రానున్నట్లు అందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌రోషన్‌ గంగూలీ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కానీ ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్‌ ఈ చిత్ర విషయమై ఇప్పటికే గంగూలీ, హృతిక్‌ను కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని