సగం పారితోషికం ఇచ్చేశాడా..?

క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఇటీవల విజయ్‌ దేవరకొండ హీరోగా వచ్చిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. భారీ అంచనాల నడుమ విడులైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

Published : 27 Feb 2020 22:10 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో విజయ్‌ ఇబ్బందుల్లో చిక్కుకున్నాడట. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. విజయ్‌ పారితోషికం నుంచి కొంత భాగాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాలని నిర్మాత కేఎస్‌ రామారావు కోరారట. చిత్రీకరణ ఆలస్యం కావడంతో పాటు బడ్జెట్‌ కూడా అనుకున్నదాని కంటే ఎక్కువ అవ్వడంతో నిర్మాత కోరిక మేరకు విజయ్‌ ఇప్పటికే తన రెమ్యునరేషన్‌లోని సగం వెనక్కి ఇచ్చేశాడట. దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

రైటర్‌ కావాలని కలలుగనే గౌతమ్ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించారు. అతడి ప్రియురాలు యామినిగా రాశీఖన్నా కనిపించారు. ఐశ్వర్యా రాజేశ్‌, కేథరిన్‌, ఇజబెల్లా కీలక పాత్రలు పోషించారు. సినిమాలో నటన పరంగా విజయ్‌ దేవరకొండ ఆకట్టుకున్నప్పటికీ వేర్వేరు ప్రేమ కథలను సమర్థంగా చూపించలేకపోవడం ఈ చిత్రానికి మైనస్‌గా మారింది. దీంతో ఈ చిత్రం అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని