‘నితిన్‌’ సినిమాలో టబు..?

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల..వైకుంఠపురములో..’ సినిమాతో తెలుగు తెరకు రీఎంట్రీ ఇచ్చి మంచి ప్రశంసలు అందుకున్నారు ప్రముఖ నటి టబు. ‘అల..వైకుంఠపురములో..’ సినిమా తర్వాత ఆమె ఏ తెలుగు హీరోతో నటించనున్నారనే విషయం పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా...

Published : 05 Mar 2020 16:23 IST

హైదరాబాద్‌: సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల..వైకుంఠపురములో..’ సినిమాతో తెలుగు తెరకు రీఎంట్రీ ఇచ్చి మంచి ప్రశంసలు అందుకున్నారు ప్రముఖ నటి టబు. ‘అల..వైకుంఠపురములో..’ సినిమా తర్వాత ఆమె ఏ తెలుగు హీరోతో నటించనున్నారనే విషయం పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె టాలీవుడ్‌ హీరో నితిన్‌ సినిమాలో సందడి చేయనున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఇటీవల విడుదలైన ‘భీష్మ’ సినిమాతో మిశ్రమ స్పందనలు అందుకున్న నితిన్‌.. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో  కొత్త సినిమాకి సంతకం చేశారు. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘అంధాధున్‌’ సినిమాకి రీమేక్‌గా నితిన్‌-మేర్లపాక గాంధీ చిత్రం తెరకెక్కనుంది.

‘అంధాధున్‌’ రీమేక్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు గతకొన్నిరోజుల క్రితం ఘనంగా జరిగాయి. నితిన్‌ వివాహం తర్వాత ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటుల గురించి చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో టబు నటించనున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయుష్మాన్‌ ఖురానా ‘అంధాధున్‌’ సినిమాలో టబు.. సిమీ సిన్హా అనే కీలకమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. దీంతో మాతృకలో నటించిన టబునే రీమేక్‌లో కూడా సిమీ పాత్రకోసం నటిస్తే బాగుంటుందని చిత్రబృందం భావిస్తుందట. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts