లారీ డ్రైవర్‌గా బన్నీ.. లుక్‌ ఇదేనా?

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన తర్వాతి సినిమాకు సిద్ధమౌతున్నారు. సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో..’ హిట్‌ అందుకున్న ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. కేరళలో ఈ సినిమా షూటింగ్‌ జరగబోతోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే మాఫియా కథతో .....

Published : 14 Mar 2020 18:42 IST

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన తర్వాతి సినిమాకు సిద్ధమౌతున్నారు. సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో..’ హిట్‌ అందుకున్న ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. కేరళలో ఈ సినిమా షూటింగ్‌ జరగబోతోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే మాఫియా కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారట. ఈ మేరకు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా బన్నీ తాజా లుక్‌ బయటికి వచ్చింది. ఆయన శనివారం తన బాడీగార్డు పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బన్నీ గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో కనిపించారు. ఆయన తర్వాతి సినిమాలో లుక్ ఇదేనని నెటిజన్లు భావిస్తున్నారు. ‘రంగస్థలం’లో చరణ్‌ కూడా ఇలాగే గుబురు గడ్డంతో సినిమా మొత్తం కనిపించడమే కాదు.. తన నటనతో మెస్మరైజ్‌ చేశారు. సుక్కు మరోసారి ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారని టాలీవుడ్‌ టాక్.

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. సుకుమార్-బన్నీలది క్రేజీ కాంబినేషన్‌. వీరిద్దరూ కలిసి ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని