మోహన్‌లాల్, ఎన్టీఆర్ మరోసారి?
మోహన్‌లాల్, ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటించిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. మరోసారి
హైదరాబాద్: మోహన్‌లాల్, ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటించిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. మరోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారా? అందుకు ‘ఆర్ఆర్ఆర్’ వేదిక కాబోతోందా? అంటే టాలీవుడ్లో ఇదే టాక్ నడుస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం’. ఇందులో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆయన ఫస్ట్‌లుక్, టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. ఇక కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. కొమరం భీం జీవితంలో ఆయన బాబాయ్ ప్రధాన పాత్ర పోషించారట. అందుకే ఆ పాత్ర కోసం మోహన్‌లాల్‌ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ‘జనతా గ్యారేజ్’లో మోహన్‌లాల్-ఎన్టీఆర్‌లు కనిపించిన సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో కొమరం భీం బాబాయ్ పాత్రకు మోహన్‌లాల్ సరిపోతారని జక్కన్న భావించారట. ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని, దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆలియా భట్, ఓలివియా మోరిస్‌లు నాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత