బాలకృష్ణ సినిమాలో భూమిక పాత్ర అదేనా?

ఒకప్పుడు కథానాయిగా వరుస అవకాశాలు దక్కించుకున్న నటి భూమిక. వివాహం తర్వాత విరామం తీసుకున్న ఆమె రీఎంట్రీతో పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు

Updated : 16 Apr 2020 15:05 IST

హైదరాబాద్‌: ఒకప్పుడు కథానాయిగా వరుస అవకాశాలు దక్కించుకున్న నటి భూమిక. వివాహం తర్వాత విరామం తీసుకున్న ఆమె రీఎంట్రీతో పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నయనతార నటించిన ‘వసంతకాలం’ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించిన ఆమె, ఇప్పుడు ఏకంగా అగ్ర కథానాయకుడు బాలయ్యకు విలన్‌గా నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్‌ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి చిత్రంలోని ఇతర పాత్రలపై దృష్టి సారించారట. ఇందులో భాగంగా ప్రతినాయక ఛాయలున్న పాత్ర కోసం భూమికను తీసుకుంటే ఎలా ఉంటుందని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని సమాచారం. 

గతంలో బాలకృష్ణ నటించిన ‘రూలర్‌’ సినిమాలో భూమిక కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ నటిస్తుండటం, అది కూడా ప్రతినాయకురాలి పాత్ర కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి భూమిక.. బాలయ్యకు విలన్‌గా కనిపిస్తుందా? లేదా కథను మలుపు తిప్పే పాత్రా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల అనంతరం బోయపాటి, బాలకృష్ణ కయికలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. నాయిక వివరాలు ఇంకా ఖరారు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని