ఆ దర్శకుడితోనూ సినిమా చేస్తున్నారా?
ఒక సినిమా సగంలో ఉండగానే మరో రెండు సినిమాలను ప్రకటించేస్తారు యువ కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన ఇంద్రగంటి...
హైదరాబాద్: ఒక సినిమా సగంలో ఉండగానే మరో రెండు సినిమాలను ప్రకటించేస్తారు యువ కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించిన ‘వి’ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా వాయిదాపడింది. కొత్త తేదీని ప్రకటించాలి. దీని తర్వాత శివ నిర్వాణతో ‘టక్ జగదీష్’, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యాం సింగరాయ్’ సినిమాలు చేయనున్నారు. దీంతో పాటు ‘బ్రోచెవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయతోనూ ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది.
ఇప్పుడు తాజాగా మరో యువ దర్శకుడు చెప్పిన పాయింట్ కూడా నానికి నచ్చిందట. ‘హిట్’ ఫేం శైలేష్ కొలను నానికి ఓ ఆకస్తికర పాయింట్ వినిపించాడని, అది నచ్చిన పూర్తి కథను సిద్ధంగా చేయమన్నాడని తెలుస్తోంది. త్వరలోనే స్పష్టత రానుంది. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘హిట్’ సినిమాకు నానినే నిర్మాత. అప్పుడు నిర్మాతగా, ఇప్పుడు కథానాయకుడుగా శైలేష్‌తో కలిసి పనిచేయబోతున్నాడు నాని. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న శైలేష్ నానితో ఎలాంటి కథను తెరపై చూపిస్తాడో? వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి