నితిన్‌కు జోడీగా ‘గ్యాంగ్‌లీడర్‌’ హీరోయిన్‌?

బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఆయుష్మాన్‌ ఖురానాకు జాతీయ అవార్డును సైతం తెచ్చిన చిత్రం ‘అంధాదున్‌’. తెలుగు

Published : 29 Apr 2020 11:57 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఆయుష్మాన్‌ ఖురానాకు జాతీయ అవార్డును సైతం తెచ్చిన చిత్రం ‘అంధాదున్‌’. తెలుగులో నితిన్‌తో ఈ సినిమాను రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం షూటింగ్‌ వాయిదా పడింది. 

ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని నితిన్‌ సరసన నటించే హీరోయిన్‌ కోసం వెచ్చిస్తున్నారట. కాగా, నాని ‘గ్యాంగ్‌లీడర్‌’లో నటించిన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉందట చిత్ర బృందం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కొద్దిరోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్నిమెప్పించింది ప్రియాంక. మరి ఈ సారి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. బి.మధు సమర్పణలో ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts