మరోసారి నాయికా ప్రధానమైన చిత్రంలో..?

తెలుగులో నాయికా ప్రధానమైన కథలకి కేరాఫ్‌గా నిలుస్తోంది అనుష్క. అదే తరహా కథలో ఆమె మరోసారి మెరవబోతోందా అంటే... అవుననే

Published : 16 Jun 2020 15:01 IST

హైదరాబాద్‌: తెలుగులో నాయికా ప్రధానమైన కథలకి కేరాఫ్‌గా నిలుస్తోంది అనుష్క. అదే తరహా కథలో ఆమె మరోసారి మెరవబోతోందా అంటే... అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఓ యువ దర్శకుడు అనుష్క కోసమే సిద్ధం చేసిన కథని ఇటీవలే ఆమెకు వినిపించినట్టు సమాచారం. 

యు.వి.క్రియేషన్స్‌లో ఆ  చిత్రం తెరకెక్కబోతున్నట్టు తెలిసింది. అందుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఊపందుకున్నాయట. ఇటీవల అనుష్క ‘నిశ్శబ్దం’లో నటించింది. ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని