Taapsee: ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లో తాప్సి?

నటి తాప్సి తెలుగులో సినిమా చేసి చాలా కాలమైంది. ‘గేమ్‌ ఓవర్‌’ తర్వాత ఆమె నుంచి మరో తెలుగు చిత్రమేదీ రాలేదు. బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది.

Published : 15 Jun 2021 19:54 IST

టి తాప్సి తెలుగులో సినిమా చేసి చాలా కాలమైంది. ‘గేమ్‌ ఓవర్‌’ తర్వాత ఆమె నుంచి మరో తెలుగు చిత్రమేదీ రాలేదు. బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. ప్రస్తుతం సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలో ఆమె ఓ తెలుగు చిత్రంలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అదే.. స్వరూప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి విజయం తర్వాత స్వరూప్‌ నుంచి వస్తున్న రెండో చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పుడిందులో ఓ ప్రధాన పాత్ర కోసం తాప్సీని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె పాత్రకి ఎంతో ప్రాధాన్యముందని, కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంటుందని ప్రచారం వినిపిస్తోంది. లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల ఆగిన ఈ సినిమా.. త్వరలో తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుంది. హైదరాబాద్‌లో జరగనున్న ఈ కొత్త షెడ్యూల్‌లోనే.. తాప్సి సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు
తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఈ సినిమాని నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. మార్క్‌.కె.రాబిన్‌ స్వరాలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని