Rajasekhar: సంక్రాంతికి ముస్తాబు?

2022 సంక్రాంతి లక్ష్యంగా పట్టాలెక్కిన సినిమాలు చాలానే. అయితే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ విడుదల ఖరారైన తర్వాత పక్కాగా ఏ సినిమా వస్తుందో చెప్పలేని పరిస్థితి.

Published : 03 Nov 2021 18:32 IST

2022 సంక్రాంతి లక్ష్యంగా పట్టాలెక్కిన సినిమాలు చాలానే. అయితే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ విడుదల ఖరారైన తర్వాత పక్కాగా ఏ సినిమా వస్తుందో చెప్పలేని పరిస్థితి. ‘రాధేశ్యామ్‌’, ‘భీమ్లానాయక్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘సర్కారు వారి పాట’ సినిమాలు ఇప్పటికీ  సంక్రాంతి రేసులోనే ఉన్నాయి. వీటికితోడు ‘బంగార్రాజు’, ‘ఎఫ్‌3’లూ పండగ బరిపైనే కన్నేశాయి. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వస్తుండగా, ఇన్ని సినిమాలు విడుదల కావడం అనుమానమే. అయితే సంక్రాంతి సందర్భంగా ఎప్పుడూ స్టార్‌ హీరోల సినిమాలకి తోడుగా, ఒకట్రెండు పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అలా రాజశేఖర్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘శేఖర్‌’ ఈసారి సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి   చేసుకున్న ఈ సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. మలయాళంలో విజయవంతమైన ఓ సినిమాకి రీమేక్‌గా, లలిత్‌ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని