పైలెట్‌గా శింబు

శింబు, హన్సిక కలిసి నటించిన చిత్రం ‘వాలు’. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. తర్వాత ఇద్దరూ విడిపోయారు. దీంతో చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసి ‘మహా’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Updated : 04 Jan 2020 08:32 IST

‘మహా’లో శింబు

కోడంబాక్కం: శింబు, హన్సిక కలిసి నటించిన చిత్రం ‘వాలు’. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. తర్వాత ఇద్దరూ విడిపోయారు. దీంతో చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసి ‘మహా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది కథానాయిక ప్రాముఖ్యత కలిగిన చిత్రం. శింబు అతిథిపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తంబిరామయ్య, సనంశెట్టి, కరుణాకరన్‌ ఇతర తారాగణం. ఇది హన్సికకు 50వ చిత్రం కావడం విశేషం. యూఆర్‌ జమీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెకెండ్‌ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. దీన్నిబట్టి చూస్తే శింబు పైలెట్‌గా నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాకుండా శింబు అభిమానులను ఈ లుక్‌ కట్టిపడేస్తోంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మార్చుతున్నారు. కొంత కాలంగా సరైన హిట్‌ కోసం శింబు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అభిమానులను తృప్తిపరిచే విధంగా ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని