Published : 04/01/2020 18:39 IST

సంక్రాంతి సినిమాలపై వీడిన సస్పెన్స్‌

ఎవరూ నష్టపోకూడదని..: దిల్‌రాజు

హైదరాబాద్‌: ఈ ఏడాది సంక్రాంతికి రాబోతున్న తెలుగు సినిమాల విడుదల తేదీలపై ఉత్కంఠ వీడింది. జనవరి 9న రజనీకాంత్‌ ‘దర్బార్‌’తో మొదలు కానున్న పండగ సందడి.. జనవరి 15న ‘ఎంత మంచివాడవురా’ వరకూ కొనసాగనుంది. జనవరి 11న ‘సరిలేరు నీకెవ్వరు’, జనవరి 12న ‘అల వైకుంఠపురములో..’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ తేదీలను చిత్ర బృందం ముందే ప్రకటించినప్పటికీ.. సెన్సార్‌ సమయంలో పోస్టర్లపై విడుదల తేదీలు ఇవ్వలేదు. ఇలాంటి కొన్ని కారణాల వల్ల ప్రేక్షకులు, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం శనివారం తెలుగు చిత్ర నిర్మాతల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించింది. సంక్రాంతి సినిమాల విడుదలపై నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు.

‘రెండు మూడు రోజుల నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో..’ గురించి సోషల్‌మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ నిర్మాతలతో మాట్లాడి, ఒప్పించాం. కారణాలు ఏమైనా కావొచ్చు.. ఓ సినిమా విడుదలవుతున్నప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరూ నష్టపోకూడదు. ఆ ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేశాం. ముందుగా అనుకున్నట్లే జనవరి 11 ‘సరిలేరు నీకెవ్వరు’, జనవరి 12న ‘అల వైకుంఠపురములో..’ వచ్చేలా.. రెండు సినిమాల హీరోలు, నిర్మాతల్ని ఒప్పించాం. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మా సంఘం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు వస్తే ఇబ్బందులు ఏర్పడతాయి. మాపై నమ్మకం ఉంచిన వారికి ధన్యవాదాలు’ అని ఈ సందర్భంగా దిల్‌రాజు చెప్పారు.



Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని